About the Book
#1 పుస్తకంగా అమ్ముడుపోయిన ఆల్కెమిస్ట్ రచయిత కలం నుండి వచ్చిన అద్భుత కథ. పెద్దల నుండి జ్ఞానం కోరుకున్న ఒక యువకుడు, అతని దారిపొడుగునా నేర్చుకున్న ఆచరణాత్మక పాఠాలు !! విలుకాడులో మనం టెట్సుయా అనే వ్యక్తిని కలుస్తాము. అతను ఒకప్పుడు అసాధారణమైన విలుకాడు. తన విల్లు, బాణంతో అద్భుతాలు చేసాడు. అయితే ప్రస్తుతం అతను ప్రజాజీవితం నుండి విరమణ తీసుకున్నాడు. అతనిని అన్వేషిస్తూ ఒక యువకుడు వచ్చాడు. విల్లు మరియు బాణం గురించి ఆ యువకుడి బుర్రలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం ఇవ్వడంలో టెట్సుయా విల్లు యొక్క మార్గంలో అర్ధవంతమైన జీవితం యొక్క సిద్ధాంతాలను వివరిస్తాడు. పాలో కొయిలో కథ, చర్య మరియు ఆత్మ ఉల్లేఖనాల మధ్య సంబంధం లేకుండా జీవించడం, తిరస్కరణ లేదా వైఫల్యం భయంతో సంకోచించబడిన జీవితం, జీవించదగిన జీవితం కాదని సూచిస్తుంది. బదులుగా ప్రతిఒక్కరూ తెగించాలి, ధైర్యం పెంచుకోవాలి. అంతేకాకుండా విధి అందించే ఊహించని ప్రయాణాన్ని స్వీకరించాలి. జ్ఞానం, ఔదార్యం, సరళత, దయ పాలో కొయిలోని, ఒక అంతర్జాతీయ, అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాల రచయితగా మార్చాయి. శ్రమ, అభిరుచి, ఉద్దేశ్యం, ఆలోచన, వైఫల్యాన్ని అంగీకరించడం, వైవిధ్యాన్ని చూపాలనే తపన ఇవన్నీ సంతృప్తికరమైన జీవితానికి దోహదపడతాయన్న అంశాన్ని పాలో కొయిలో ఆసక్తికరంగా అందించారు.